Press "Enter" to skip to content

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది September 2020

Spread the love

ప్రజలెవరూ బయటకు రావద్దంటూ జీహెచ్ఎంసీ అలర్ట్
హైదరాబాద్: ప్రజలెవరూ బయటకు రావద్దంటూ జీహెచ్ఎంసీ అలర్ట్ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రోడ్లపై నిలిచిన నీటిని మోటార్లతో డిజాస్టర్ బృందాలు తొలగిస్తున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్‌లో భారీ వర్షం పడింది. సికింద్రాబాద్, బేగంపేట్, నారాయణగూడ, అమీర్‌పేట్‌, నాంపల్లి, చార్మినార్, చాంద్రాయణగుట్ట, కోఠి, అఫ్జల్‌గంజ్, బషీర్‌బాగ్, మెహదీపట్నం, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. గండిపేట్‌లో అత్యధికంగా 9.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్ 8.8, షేక్‌పేట్ 8, ఆసిఫ్‌నగర్ 7.5, గుడిమల్కాపూర్ 6.7, ఫిలింనగర్ 5.8, బండ్లగూడ 5.9, ఉప్పల్ 5.9, చార్మినార్ 5.9, జూబ్లీహిల్స్ 5.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు.

Comments are closed.