టూవీలర్ నడిపే వారికి సైబరాబాద్ పోలీసుల షాక్.. ట్రాఫిక్నిబంధనలను పాటించని వారికి హెచ్చరిక. హెల్మెట్ లేకుండా బండినడిపితే.. అడ్డంగా బుక్కవుతారు. హెల్మెట్ లేకపోతే కేవలం రూ.100 చలానా కడితే సరిపోతుందనే భావనలో ఉన్నవారికి సైబరాబాద్ ట్రాఫిక్పోలీసులు షాకిస్తున్నారు. ఇక నుంచి చలానా కట్టడం కాకుండా.. హెల్మెట్ లేకుండా బండి నడిపిన వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందనిస్పష్టం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సైబరాబాద్ ట్రాఫిక్పోలీసులు ఓ షార్ట్ వీడియోను రిలీజ్ చేశారు. మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారంహెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని ట్రాఫిక్పోలీసులు తెలిపారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే… మొదటిసారిపట్టుబడితే మూడు నెలలు, రెండోసారి కూడా దొరికిపోతే శాశ్వతంగాడ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడానికి సంబంధిత ఆర్టీవో అధికారులకుసిఫారసు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. నాణ్యమైన హెల్మెట్లు ధరించాలని.. బైక్ నడపుతున్న వ్యక్తితోపాటు వెనుకకూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించాలని సైబరాబాద్ ట్రాఫిక్పోలీసులు సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా జాగ్రత్తగా ప్రయాణాలుచేయొచ్చని.. చలానాల నుంచి తప్పించుకోవచ్చంటున్నారు.
Hyderabad Traffic
ప్రజలెవరూ బయటకు రావద్దంటూ జీహెచ్ఎంసీ అలర్ట్ హైదరాబాద్: ప్రజలెవరూ బయటకు రావద్దంటూ జీహెచ్ఎంసీ అలర్ట్ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రోడ్లపై నిలిచిన నీటిని మోటార్లతో డిజాస్టర్ బృందాలు…
Metro services will resume from the 7th of this month in line with Unlock 4 We take care of all the corona Physical distance is…
Metro Rail is permitted to Operate from 7th September 2020 onwards in a graded manner.
Officials have confirmed people injured in this incident, two trains came on the same track by not verifying the signals.