Press "Enter" to skip to content

Cyberabad police shock to two-wheeler drivers

Spread the love

టూవీలర్ నడిపే వారికి సైబరాబాద్ పోలీసుల షాక్..                 ట్రాఫిక్నిబంధనలను పాటించని వారికి హెచ్చరిక. హెల్మెట్ లేకుండా బండినడిపితే.. అడ్డంగా బుక్కవుతారు. హెల్మెట్ లేకపోతే కేవలం రూ.100 చలానా కడితే సరిపోతుందనే భావనలో ఉన్నవారికి సైబరాబాద్ ట్రాఫిక్పోలీసులు షాకిస్తున్నారు. ఇక నుంచి చలానా కట్టడం కాకుండా.. హెల్మెట్ లేకుండా బండి నడిపిన వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందనిస్పష్టం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సైబరాబాద్ ట్రాఫిక్పోలీసులు ఓ షార్ట్ వీడియోను రిలీజ్ చేశారు.

మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారంహెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని ట్రాఫిక్పోలీసులు తెలిపారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే… మొదటిసారిపట్టుబడితే మూడు నెలలు, రెండోసారి కూడా దొరికిపోతే శాశ్వతంగాడ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడానికి సంబంధిత ఆర్టీవో అధికారులకుసిఫారసు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

నాణ్యమైన హెల్మెట్లు ధరించాలని.. బైక్ నడపుతున్న వ్యక్తితోపాటు వెనుకకూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించాలని సైబరాబాద్ ట్రాఫిక్పోలీసులు సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా జాగ్రత్తగా ప్రయాణాలుచేయొచ్చని.. చలానాల నుంచి తప్పించుకోవచ్చంటున్నారు.

Comments are closed.