Press "Enter" to skip to content

Kachiguda to Karimnagar train services

Spread the love

ఏడాది తర్వాత కాచిగూడ-కరీంనగర్‌ మధ్య రైలు సేవలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 2020 మార్చి 23న రద్దు చేసిన రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు తిరిగి ప్రారంభించనున్నారు. డెము ప్రత్యేక రైలుపేరుతో దీనిని నడిపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ రైలు జిల్లా మీదుగా రాకపోకలు సాగిస్తుండటంతో ఇక్కడివారికి ఎంతో సౌకర్యం కలగనుంది. రైలు నంబరు 07793/07794తో ప్రయాణికులకు సేవలు అందనున్నాయి. ఇది ప్రతి రోజూ కాచిగూడలో ఉదయం 6 గంటలకు బయలుదేరి సీతాఫల్‌మండి, మల్కాజిగిరి, బొల్లారం, గుండ్లపోచంపల్లి, మేడ్చల్‌ మీదుగా జిల్లాలోని మనోహరాబాద్‌కు 7.17, స్టేషన్‌ మాసాయిపేటకు 7.30, వడియారం స్టేషన్‌కు 7.40 గంటలకు చేరుకుంటుంది. మీర్జాపల్లికి 7.50, అక్కన్నపేటకు 8.00 గంటలకు చేరుకుంటుంది. జిల్లాలో ఈ రైల్వేస్టేషన్లలో మాత్రమే డెము రైలు ఆగుతుంది. నిజామాబాద్‌కు 10.30 గంటలకు, కరీంనగర్‌కు మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకుంటుంది. తిరిగి అక్కడి నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రారంభమై నిజామాబాద్‌, కామారెడ్డి మీదుగా జిల్లాలోని అక్కన్నపేటకు రాత్రి 7.47, మీర్జాపల్లి 7.58, వడియారం 8.08, మాసాయిపేటకు 8.19, మనోహరాబాద్‌కు 8.33 గంటలకు వస్తుంది. అక్కడి నుంచి మేడ్చల్‌ మీదుగా కాచిగూడకు రాత్రి 11 గంటలకు చేరుకుంటుంది. జిల్లాలో ప్రతి స్టేషన్‌లో ఒక నిమిషం మాత్రమే ఈ రైలు ఆగుతుంది. ఈ రైలు ప్రారంభంతో వివిధ చోట్లకు వెళ్లే ప్రయాణికులు తక్కువ ఛార్జీతో గమ్యస్థానాలకు వెళ్లవచ్ఛు.

Comments are closed.